Friday, May 17, 2024
- Advertisement -

రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ ‘అరవింద స‌మేత’

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా న‌టించిన అరవింద స‌మేత.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా నిన్న‌నే(శుక్ర‌వారం) విడుద‌లైంది.సినిమా మొద‌టి షో నుంచే హిట్ టాక్ రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.కొత్త ర‌క‌మైన ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా యూఎస్‌లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.ఇప్పటికే అయిదు సినిమాలతో తారక్ యూఎస్ లో 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేశాడు. ఇక ఇప్పుడు అరవింద సమేతతో 6వ సారి ఆ రికార్డును అధిగమించాడు. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. బుధవారం ప్రీమియర్స్ ద్వారా $797,366 కలెక్షన్స్ అందాయి. ఇక గురువారం రాత్రి 10.30 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం $207,870 అందినట్లు తెలుస్తోంది.

187 సెంటర్లలో మొత్తంగా అరవింద సమేత $1,004,761 లను వసూలు చేసి టాలీవుడ్ సినిమాల సత్తాను చాటింది. కలెక్షన్స్ స్పీడ్ చూస్తుంటే 2 మిలియన్ డాలర్లను అందుకోవడానికి ఎక్కువగా టైమ్ పెట్టె అవసరం లేదని అర్ధమవుతోంది. ఆదివారం నాటికి ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ ను ఈజీగా అందుకోగలదని సమాచారం.ఎన్టీఆర్ న‌ట‌న‌కు తోడు,పూజా హెగ్డె ఈషా రెబ్బాలు గ్లామ‌ర్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.ఇక త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్లో నిల‌బెట్టింద‌ని సినీ విశ్లేషుకులు చెబుతున్నారు.ఈ సినిమాతో ఎన్టీఆర్ వ‌రుస‌గా ఐదు హిట్లు సాధించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -