Monday, April 29, 2024
- Advertisement -

‘అర‌వింద స‌మేత’ మొద‌టి రోజు ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా?

- Advertisement -

ఎన్ఠీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత నిన్న‌నే విడుద‌లైంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మొద‌టి నుంచే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది.దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు.రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది.ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా నాన్ ‘బాహుబలి’ రికార్డును అధిగమించిందని స‌మాచారం.ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.73 కోట్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 26.64 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఎన్టీఆర్ కెరియర్లో తొలి రోజు వసూళ్ల విషయంలో తొలి స్థానంలో ఈ సినిమా నిలవడం విశేషం. ఎన్టీఆర్ న‌ట‌న‌కు తోడు,పూజా హెగ్డె ఈషా రెబ్బాలు గ్లామ‌ర్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.ఇక త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్లో నిల‌బెట్టింద‌ని సినీ విశ్లేషుకులు చెబుతున్నారు.ఈ సినిమాతో ఎన్టీఆర్ వ‌రుస‌గా ఐదు హిట్లు సాధించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -