Thursday, May 16, 2024
- Advertisement -

నాగ‌బాబుని కాపాడిన ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్ నాగ‌బాబుని కాపాడటం ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కథకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నాయి.తాజాగా ఈ సినిమాలోని ఫోటో ఒక‌టి బ‌య‌టికి లీక్ అయింది.

ఈ ఫొటోలో ఎన్టీఆర్, నాగబాబులు గాయాలతో కనిపిస్తున్నారు. నాగబాబుని చూస్తూ టెన్షన్ పడుతోన్న ఎన్టీఆర్ లుక్ చాలా ఎమోషనల్ గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ఈ సినిమాలో నాగ‌బాబు కొడుకుగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడని స‌మాచారం.ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజ హెగ్డె,ఈషా రెబ్బా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయ‌ల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడు.ఎమోష‌నల్ ఫోటో బ‌య‌టికి రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఈ సినిమా ఎన్టీఆర్‌కు మ‌రో హిట్ ఇస్తుంద‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -