Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ చెప్పుకోవ‌డానికి ఏమీ మిగ‌ల‌వు…భాజాపా నేత కృష్ణంరాజు

- Advertisement -

చంద్ర‌బాబునాయుడికి భాజాపా మాజీ ఎంపీ,సినీన‌టుడు కృష్ణంరాజు ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. మోదీపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో… అవిశ్వాస తీర్మానం ద్వారా తేలిపోయిందని చెప్పారు. అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతును కూడగట్టామని టీడీపీ చెప్పుకుందని… అయితే, ఏపీకి అన్యాయం జరిగిందనే విషయాన్ని మాత్రం ఏఒక్క పార్టీతో కూడా చెప్పించలేకపోయిందని ఎద్దేవా చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, ట్రైబల్ వర్సిటీపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

జాతీయ విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి కేంద్రం కృషి చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేతల వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం భావ్యం కాదన్నారు. దేశంలో తిరుగులేని నేత మోడీనే అన్నారు. మోడీపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అవిశ్వాస తీర్మానం ద్వారా తెలిసిందన్నారు.

కేంద్ర మంత్రులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించబోతున్నారని… వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారని… త్వరలోనే వాటికి శాశ్వత భవనాలను నిర్మిస్తారని చెప్పారు.

అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమైతే వాటికి కావాల్సిన వనరులను కేంద్రం చూపిస్తుందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి ఇకపై ఏ అంశం మిగలదన్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై నివేదికను తయారు చేసి, ఢిల్లీ పెద్దలకు పంపుతామన్నారు. త్వరలోనే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అవుతామన్నారు.
తీసుకుంటుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -