Tuesday, May 21, 2024
- Advertisement -

లీకైన ఎన్టీఆర్ సినిమా కథ………. నందమూరి ఫ్యాన్స్‌కి సూపర్ షాక్ ఇస్తున్న కథ

- Advertisement -

తెలుగు జాతి ఔన్నత్యాన్ని దశదిశలాచాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌గా చెప్పబడుతున్న కథ లీకవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అన్నింటికీ మించి ఆ కథ తెలుసుకున్న నందమూరి అభిమానులు దిమ్మతిరిగే షాక్ తిన్నారు. కథ మొత్తం కూడా బసవ తారకం పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలవుతుంది. ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యే వరకూ ఉన్న సీన్స్ అన్నింటినీ కూడా వాయిస్ ఓవర్‌లో చెప్పించేస్తారు. అసలు కథ మాత్రం ఎన్టీఆర్‌కి చంద్రబాబు అల్లుడవ్వడం అనే దశ నుంచీ స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్‌కి చంద్రబాబు లక్షణాలు నచ్చడం, చంద్రబాబు అత్యంత ప్రతిభావంతుడని చెప్పి బసవతారకం, ఎన్టీఆర్‌లతో సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ గుర్తించడం లాంటి సన్నివేశాలతో పెళ్ళి ఎపిసోడ్ ఉంటుంది.

ఇక అప్పటికే రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు అల్లుడైన తర్వాతే ఎన్టీఆర్‌కి రాజకీయ నాయకులతో పరిచయాలు పెరిగాయని, ఆ తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కి వచ్చింది అన్న సీన్స్ ఉంటాయి. ఇక ఆ పైన అన్ని విషయాలూ చంద్రబాబుతో ఎన్టీఆర్ షేర్ చేసుకునేవాడు……..అలాగే నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ టైంలో చంద్రబాబే ముందుండి ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిని చేశాడు అన్న కోణంలో ఈ ఎన్టీఆర్ పొలిటికల్ కథ ఉండబోతోంది. సినిమా కెరీర్‌కి సంబంధించిన ఎన్టీఆర్ కథ, సన్నివేశాలు ఈ పొలిటికల్ కథకు అదనం.

మొత్తంగా చూస్తే ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు ఎన్టీఆర్‌ని ఉపయోగించుకున్న చంద్రబాబు, వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత ఆత్మక్షోభతో ఎన్టీఆర్ చనిపోతే ఆ తర్వాత కూడా ఎన్టీఆర్‌ని వాడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌తో కూడా 2019 ఎన్నికలను చంద్రబాబు టార్గెట్ చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ విషయాలే నందమూరి అభిమానుల్లో ఆవేదన పెంచుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబుని సమర్థుడిగానూ, ఎన్టీఆర్‌కి అన్ని విషయాల్లోనూ అండగా నిలిచినవాడిగానూ చూపించడం, అన్ని విషయాల్లోనూ చంద్రబాబుపై ఎన్టీఆర్ ఆధారపడేవాడని చూపించడం………….కచ్చితంగా ఎన్టీఆర్ అసమర్థుడు అని జనాలకు చెప్పడమే అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కథ చంద్రబాబు గొప్పదనం చెప్పడం కోసం తీయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ఘాటు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -