Tuesday, May 21, 2024
- Advertisement -

చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్న ధర్మాబాద్ కోర్టు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2010లో తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే సమయంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సహా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు ఎండిపోయే అవకాశం ఉంది. దీంతో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ చంద్రబాబునాయుడు సహా ఆనాడు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆందోళన నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.

తొలుత డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పిన పోలీసులు, ఆ తర్వాత చంద్రబాబు సహా పలువురు నాయకులను అరెస్ట్ చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలతో పాటు 76 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బాబ్లీ డ్యామ్ వద్ద ఆందోళనలు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కూడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు సీఎంగా ఉన్న రోశయ్య మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బాబు సహా ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -