Saturday, May 4, 2024
- Advertisement -

ముంచుకొస్తున్న ప్ర‌పంచ వినాశ‌నం….జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే అక‌లికేక‌లు త‌ప్ప‌వు..?

- Advertisement -

మానువ‌లు త‌మ వినాశ‌నాన్నా తానే కొని తెచ్చ‌కుంటున్నారు. అభివృద్ధి పేరుతో ప‌ర్యావ‌ర‌ణానికి తూట్లు పొడుస్తున్నారు. గ్లోబుల్ వార్మింగ్ పెరిగిపోవ‌డంతో వాతావరణ మార్పులు ప్రమాదకర దశకు చేరాయని అతి కొద్ది రోజుల్లోనే ప‌రిస్థితి మ‌నుషుల చేయి దాటిపోతుంద‌ని ఐరాసా ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించింది.

ప‌రిశ్ర‌మ‌లకోసం అడ‌వుల‌ను న‌రికివేయ‌టంతో వాతావ‌ర‌ణంలో మార్పులు భ‌యంక‌రంగా వ‌స్తున్నాయి. అంతే కాకుండా క‌ట్ట‌డాలు పేరుతో ప‌చ్చ‌ని అడ‌వుల‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. దీంతో వాతావ‌ర‌ణ‌లో ఉష్ణోగ్ర‌త పెరిగిపోవ‌డంతో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ఎలా ముంచెత్తాయో ప్ర‌పంచం అంతా చూసింది. వరదల కారణంగా 400మంది మృత్యువాత పడ్డారు. 10లక్షలమంది నిరాశ్రయులయ్యారు అని ఐరాసా అధ్య‌క్షుడు గుటేరస్ తెలిపారు.

మరో రెండువారాల్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో.. సోమవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో వాతావరణ మార్పులు అంశంపై జరిగిన చారిత్రక సదస్సులో గుటేరస్ మాట్లాడారు. మన స్పందనలకన్నా వేగంగా వాతావరణం మార్పులకు గురవుతున్నది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆకలికేకలు పెరిగాయని, మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రధానంగా బలవుతున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ ఆహారభద్రత-పోషకాహార స్థితి నివేదిక వెల్లడించింది.

ఉష్ణోగ్రతలు, కరువు, తుఫానుల వంటి వాతావరణ అవరోధాల కారణంగా గత ఏడాది ఈ సంఖ్య 82.1కోట్లకు చేరిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలో ప్రతీ తొమ్మిది మందిలో ఒకరు పోషకాహారలోపం కలవారేనని పేర్కొన్నది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. 2030నాటికి ఆకలి, పోషకాహార లోపం లేనివిధంగా ప్రపంచాన్ని మార్చాల్సి ఉంటుంది అని సూచించింది.

వాతావరణ మార్పులపై వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు ఐరాస ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తెచ్చి, సమగ్ర కార్యాచరణ రూపొందించేదిశగా దీన్ని నిర్వహించనున్నారు. ఈ స‌ద‌స్సులో ప్ర‌పంచ దేశాలు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -