Monday, May 13, 2024
- Advertisement -

రెండు సినిమాల్లో బాబు పాత్రే కీల‌కం…..?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నటసార్వభౌములు నందమూరి తారక రామారావు. ఎలాంటి పాత్ర‌లైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల మ‌హా న‌టుడు. తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన తెలుగు దేశం పార్టీ స్థాపించి గ్రామ గ్రామానికి టీడిపి పార్టీ గురించి వివరించడమే కాదు..ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చారు. ఎన్నో వినూత్న ప‌థ‌కాలు ప్రారంభించారు. అయితె ఇప్పుడు ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా వ‌స్తున్న రెండు సినిమాలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. రెండు సినిమాల్లో వెన్న‌పోట్లు సీన్లే ప్ర‌ధానం కానున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ ల హడావుడి స్టార్ట్ అయింది. బాలయ్య నటిస్తూ, పార్టనర్ షిప్ లో నిర్మించ‌నున్నారు. ఈసిన‌మాకు తేజ తెర‌కెక్కిస్తున్నారు. ఇక వ‌ర్మ తెర‌కెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో వెన్నుపోట్లే ప్ర‌ధానం. రెండు సినిమాల్లో ఆంధ్ర చంద్రబాబు పాత్ర ఏ మేరకు వుంటుందన్నది కీలకంగా వుంది.

తేజా డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో బాల‌కృష్న న‌టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి, గెలిచి, అధికారం చేపట్టి, వెన్నుపోటు కారణంగా గద్దె దిగి, దానిపై పోరాటం సాగించి, మళ్లీ అధికారం చెపట్టడంతో బాలయ్య నిర్మించే బయోపిక్ పూర్తవుతుంది. అక్క‌డైతె మొద‌టి సినిమా పూర్త‌వుతుందో అక్క‌డ‌నుంచి వ‌ర్మ నిర్మించనున్న సినిమా స్టార్ట్ అయ్యింది.

వెన్నుపోటు పోరాటంలో చంద్రబాబుదే కీలక పాత్ర అన్న సంగతి అందరికీ తెలిసిందే. బెంగుళూరులో ఎమ్మెల్యేల క్యాంప్ రన్ చేసి, మొత్తం కీలక పాత్ర పోషించింది చంద్రబాబునే. నాదెండ్ల వెన్నుపోటు, ప్రజాస్వామ్య పోరాటమే సినిమాకు క్లయిమాక్స్ కాబట్టి, ఈ ఎపిసోడ్ లో బాబు పాత్ర వుండాల్సిందే.

ఇక వర్మ రూపొందించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అసలు ప్రారంభం కావడమే లక్ష్మీ పార్వతి ఎంట్రీతో ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ గద్దె దిగడం, ఆ తరువాతి దురుదృష్టకర సంఘటలు క్లయిమాక్స్ గా వుంటుంది. అంటే ఇక్కడా చంద్రబాబు పాత్ర కీలకం అవుతుంది.

అంటే రెండు సినిమాల్లో చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారో కానీ చాలా ఇంట్ర‌స్ట్‌గా ఉంటుంది. బాలయ్య బయోపిక్ లో చంద్రబాబు పాత్ర లో నారా రోహిత్ నటిస్తారేమో అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తం మీద రెండు సినిమాలు పేర్లు వేరయినా, బాబూస్ ఎన్టీఆర్ అన్నట్లే వుంటాయి. రెండు సినిమాల్లో ఏ సిన‌మా హిట్ అవుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -