Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్’ బాల‌య్య ఫ‌స్ట్ లుక్‌…ఎన్టీఆర్ గెటప్‌‌లో బాలయ్య స్టన్నింగ్ లుక్

- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్’ మూవీ నుండి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

తాజాగా నందమూరి తారకరామారావు సిగ్నేచర్ లుక్‌లో నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ చేశారు. స్వయంగా అన్నగారే దిగివచ్చారా? అన్నట్టుగా ఉన్న ఈ లుక్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య న్యాయం చేయగలరా? అన్న సందేహాలకు ఒక్క లుక్‌తో సమాధానం ఇచ్చారు బాలయ్య.

ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా …. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు. భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నట్లు టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -