Sunday, May 19, 2024
- Advertisement -

భాజాపా ఆశ‌ల‌పై నీల్లు చ‌ల్లిన ఈసీ…

- Advertisement -

జమిలి ఎన్నికలు జరపాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. మోదీ, అమిత్‌షా ద్వ‌యం స్పీడ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే… దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే… వివిధ శాసనసభల గడువును తగ్గించడమో లేదా పెంచడమో చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలన్నింటినీ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే అందుకు సరిపడా పోలీస్‌, పోలింగ్‌ సిబ్బంది అవసరం ఉంటుందని రావత్‌ పేర్కొన్నారు. లోక్‌సభ, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా న్యాయ కమిషన్‌కు లేఖ రాసిన మరుసటి రోజే రావత్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్‌ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. దీనిపై న్యాయ కమిషన్‌ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -