Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి విడుద‌ల చేస్తాం: నంద‌మూరి బాల‌కృష్ణ‌

- Advertisement -

తెలుగు రాజ‌కీయాల్లో దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు పాత్ర మ‌రువ‌లేనిది. ఆయ‌న గురించి తెలుగు రాజ‌కీయాల్లో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన పేరు. అగ్ర సినీనటుడిగా.. రాజ‌కీయ చ‌తురుడిగా నందమూరి తారక రామారావు పేరు ప్ర‌ఖ్యాతులు పొందాడు. చివ‌రికి కొన్ని కుట్ర‌లు, క‌ప‌ట నీతి రాజ‌కీయాల‌కు బ‌ల‌య్యి జీవిత చ‌ర‌మాంకంలో నైరాశ్యంలో ప్రాణాలు వ‌దిలారు. అంత‌టి మ‌హాశ‌యుడి జీవితంపై ఆయ‌న త‌న‌యుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సినిమా తెర‌కెక్కిస్తాన‌ని ఎప్పుడో ప్ర‌క‌టించాడు.

అయితే ఇటీవ‌ల ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ స‌రిపోలేద‌ని.. పాత్ర‌ల‌కు న‌టీన‌టులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని ద‌ర్శ‌కుడు సినిమాను ఆపేశాడ‌ని పుకార్లు వినిపించాయి. ఈ సినిమా ఆగిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ స్పందించారు. లేదు లేదు ఈ సినిమాను తీస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్టీఆర్ జీవితాధారంగా తెరకెక్కించనున్న సినిమా షూటింగ్‌ ఈ నెల 29వ తేదీన ప్రారంభిస్తున్నట్లు బాలకృష్ణ ప్ర‌క‌టించారు. ‘ఎన్టీఆర్’ సినిమా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నది కాదని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలుగువారందరూ పార్టీలకతీతంగా ‘ఎన్టీఆర్’ను అభినందించేవారేనని.. ఈ సినిమాకు చాలామంది చాలాపేర్లు సూచించినా ‘ఎన్టీఆర్’ పేరే సినిమాకు త‌గ్గట్టుగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాలో న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు ఎవ‌రో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -