Saturday, May 4, 2024
- Advertisement -

ఆస్కార్ వేడుక‌ల్లో భార‌త న‌టీన‌టుల‌కు ఘ‌న నివాళి

- Advertisement -

ప్ర‌పంచవ్యాప్తంగా సినీ రంగానికి ఆస్కార్ అవార్డులు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ఈ అవార్డు అందుకున్న వారు ప్ర‌పంచ కీర్తిని పొందుతారు. ఈ అవార్డులు పొంద‌డానికి భారత సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వాళ్లు త‌హ‌త‌హ‌లాడుతారు. మ‌రీ నేటి నుంచి (మార్చి 5) ప్రారంభమైన‌ 90వ ఆస్కార్‌ అవార్డుల‌ వేడుకల్లో అవార్డులు ఎవ‌రినీ వ‌రిస్తాయో చూడాలి. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ప్రారంభ‌మైన ఈ వేడుక‌ల్లో భారత సినీ ప్ర‌ముఖుల‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌ర‌ణించిన బాలీవుడ్ న‌టులు శశికపూర్‌, శ్రీదేవికి నివాళులర్పించారు. అంత‌ర్జాతీయ అవార్డుల వేడుక‌ల్లో భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారికి నివాళుల‌ర్పించ‌డం గ‌మ‌నార్హం.

ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడ్డర్ వేదిక పైన సంగీత ప్రదర్శనతో శ‌శిక‌పూర్‌, శ్రీదేవికి నివాళులర్పించారు. 2017 డిసెంబర్‌లో శశికపూర్‌ అనారోగ్యంతో మ‌ర‌ణించ‌గా ఫిబ్రవరి 25వ తేదీన శ్రీదేవి హ‌ఠ‌న్మ‌ర‌ణం పొందారు. భారతీయ ప్రేక్షకుల కోసం వీరికి నివాళులర్పించింది. ప్ర‌పంచంలో భార‌త ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లో ఉంటారు. వీరిని ఆక‌ట్టుకునేలా నిర్వాహ‌కులు ఈ విధంగా శ‌శిక‌పూర్‌, శ్రీదేవిని స్మ‌రించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -