Friday, May 10, 2024
- Advertisement -

ద‌గ్గుబాటిగా భ‌ర‌త్‌…!

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. క్రిషం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్‌ త‌నయుడు హీరో బాల‌కృష్ణ న‌టిస్తు,నిర్మిస్తున్నారు.ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో నంద‌మూరి కుటుంబ హీరోలందరు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

నేడు భరత్ రెడ్డి పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో పలు ముఖ్య పాత్రలను టాలీవుడ్ ప్రముఖ నటీనటులు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం సంక్రాంతికి ముందు ఓ భాగం, తరువాత మరో భాగాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నాడు క్రిష్.విద్యాబాల‌న్‌,ర‌కుల్‌,త‌మ‌న్నా,సుమంత్‌,రానా వంటి వారు సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -