Friday, April 26, 2024
- Advertisement -

టిడిపికి షాక్……. మూకుమ్మడిగా వైకాపాలో చేరిన జిల్లా స్థాయి నేతలు

- Advertisement -

ఇప్పటికే రాష్ట్రస్థాయిలో పేరున్న మేకపాటి, ఆనం, నేదురుమల్లి కుటుంబాల నాయకులందరూ వైకాపాలో చేరారు. ఇక ఇప్పుడు జిల్లా స్థాయి నాయకులందరూ కూడా మూకుమ్మడిగా వైకాపాలో చేరడం టిడిపి అధినేత చంద్రబాబును కూడా షాక్‌కి గురిచేస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లాలో వైకాపాకు ధీటుగా నిలబడలేకపోయింది టిడిపి. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేరున్న రాజకీయ కుటుంబాలన్నీ వైకాపాకే మద్దతుగా నిలుస్తున్నాయి. వేరే ఏ జిల్లాలోని లేని విధంగా ప్రముఖంగా పేరు తెచ్చుకున్న కుటుంబాలన్నీ వైకాపాలోనే చేరడం టిడిపి క్యాడర్‌ని నిరుత్సాహపరుస్తోంది.

ఇప్పుడు సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కూడా టిడిపిని వీడి వైకాపాలో చేరడం టిడిపి అధిష్టానంలో కూడా ఆందోళన పెంచుతోంది. జిల్లా స్థాయిలో అసలేం జరుగుతోంది? పార్టీని పూర్తిగా ఖాళీ చేయించేస్తారా? అని చెప్పి స్వయంగా చంద్రబాబే మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. అగ్రశ్రేణి కుటుంబాలన్నీ వైకాపాలోనే ఉన్నా సెకండ్ గ్రేడ్ నాయకులు టిడిపికి మద్దతుగా ఉన్నారు అనుకుంటే తాజాగా టిడిజి నెల్లూరు జిల్లా కార్యదర్శి యేసు నాయుడు, రఘురామిరెడ్డి, సుధాకరరెడ్డిలతో పాటు టిడిపి జిల్లా స్థాయి నాయకులు చాలా మంది వైకాపాలో చేరారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ఆయా నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడే ఈ విషయమే చంద్రబాబులో ఆగ్రహానికి కారణమైంది. ఒకవైపు వైకాపాలో కొత్తగా చేరిన ఆనంతో ఇతర నాయకులందరూ కలిసిపోయి పార్టీని బలోపేతం చేస్తోంటే…… టిడిపిలో మాత్రం మంత్రి నారాయణ-సోమిరెడ్డిల మధ్య అస్సలు పడడం లేదు. ఇతర నాయకులు కూడా సీట్ల గొడవల్లో పడి పార్టీని గాలికొదిలేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా స్వయంగా మంత్రి నారాయణకు కాల్ చేసి నెల్లూరు జిల్లాలో టిడిపిని పూర్తిగా మూసేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని టిడిపి నాయకులే చెప్తున్నారు. జిల్లాలో టిడిపి బలం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే నెల్లూరు జిల్లా టిడిపి నాయకులందరితోనూ మీటింగ్ అరేంజ్ చేయమని నారాయణకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఇప్పటికే రాయలసీమలో 2019 ఎన్నికల్లో 80శాతంపైగా సీట్లు వైకాపాకు ఖాయం అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిక నెల్లూరులో కూడా అదే స్థాయి ఫలితాలను వైకాపా సాధిస్తే మాత్రం టిడిపి పరాజయం ఊహించినదానికంటే, సర్వేల్లో చెప్తున్న దానికంటే ఇంకా ఘోరంగా ఉంటుందన్న విశ్లేషణలు నెల్లూరు జిల్లా టిడిపి శ్రేణుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -