Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్నిక‌ల బ‌రిలో ఎన్టీఆర్..?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్నారా ఏంటీ అనుకుంటున్నారా? అదేం లేదండీ ..ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్నాడు.శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.సినిమాలో ఎన్నిక‌లు గురించి ఉంటుంద‌టా.ఆ ఎన్నిక‌ల‌లో గొడ‌వ‌లలో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ నిల‌వ‌నుంద‌ని తెలుస్తుంది.ఈ ఫైట్ సీనే లీక్ అయింద‌ని స‌మాచారం.

సదరు సన్నివేశాల్లో త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో చెలరేగిపోయాడని సమాచారం. ఎన్టీఆర్ కూడా తన నట విశ్వరూపంతో అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.సినిమా రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగునుంది.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు ఇప్ప‌టికే వైరల్‌గా మారాయి.ఒక ఎన్టీఆర్‌కు జంట‌గా ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్నారు.ఈషా రెబ్బా,పూజాహెగ్డెలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -