Friday, May 10, 2024
- Advertisement -

బిగ్ బాస్ షోతో ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్నారు. స్టార్ మా ఛానల్లో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ ఈనెల 16 న ప్రసారమైంది. ఆ రోజు నందమూరి ఫ్యాన్స్ తో పాటు.. టీవీ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్టీఆర్ తన స్టెప్పులతో షోని స్టార్ట్ చేసి.. మాటలతో ఆకట్టుకున్నాడు.

ఈ ఎపిసోడ్ టెలివిజన్ రంగంలో కొత్త రికార్డుని సృష్టించింది. ఆ రోజు ప్రసారం అయిన షోకి 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) నమోదైంది. ఇంత ఏ ఇతర తెలుగు రియాలిటీ షోకి నమోదు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” గేమ్ షోకి 5.80 రేటింగ్ మాత్రమే దక్కింది. సెలబ్రిటీలు పాల్గొనే సమయంలో ఈ రేటింగ్ 7 దాకా వెళ్లేది. మెగాస్టార్ చిరంజీవికి సైతం కూడా రేటింగ్ ని ఎన్టీఆర్ సాధించి సూపర్ అనిపించారు. ఎన్టీఆర్ బుల్లితెర రికార్డ్ ని బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరి తరం కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -