Saturday, April 27, 2024
- Advertisement -

ఉప ఎన్నిక ఓటమి బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారు…?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఈసీ విడుద‌ల చేసింది.పార్టీల‌న్ని ఎన్నిక‌ల రంగంలో మ‌రింత దూకుడు పెంచ‌నున్నాయి. ఈఎన్నిక‌ను రెఫ‌రెండమ్‌గా తీసుకున్న బాబు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం గ‌మ‌నించాలి. టీడీపీ త‌రుపున భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి బ‌రిలో ఉన్నారు. అభ్య‌ర్తిని గెలిపించుకోవాల్సిన బాద్య‌త అఖిల‌పై ఉంద‌నేది తెలిసిందే.
నంద్యాల ఆమె తండ్రి నియోజకవర్గం. అక్కడ టీడీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెది. ఆమె కీలకపాత్ర పోషించకుండా ఎలా ఉంటుంది? అని సామాన్యులు అనుకోవచ్చు. కాని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకోలేదు. అందుకే అక్కడ వ్యూహరచన, ఎన్నికకు సంబంధించిన అన్ని పనుల బాధ్యత ‘నాన్‌ లోకల్స్‌’కు అప్పగించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు … కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు చూసుకుంటున్నారు.మరి ఇంతకూ మంత్రి అఖిలప్రియ చేసేదేముంది.
నంద్యాల గ్రూపు రాజకీయాలు, తగాదాలు పెద్ద తలనొప్పిగా ఉన్నాయి. అఖిలప్రియకు అక్కడి సీనియ‌ర్ నాయ‌కుల‌కు విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి కొద్దోగొప్పో విజయావకాశాలుంటే అవీ మటాస్‌ అవుతాయని అధిష్టానం భయపడింది.అఖిల అనుకోకుండా మంత్రి ప‌ద‌వి వ‌చ్చి కొంత రాజ‌కీయం సంపాదించింది.ఇదంతా తన ప్రతిభేనని భ్రమిస్తున్న అఖిల సీనియర్‌ టీడీపీ నాయకులను సైతం ఖాతరు చేయడంలేదట.త‌ల పండిన నాయ‌కుల‌ను కూడా అమె లెక్క చేయ‌డంలేదు.
అందుకే ప్రచారానికే పరిమితం చేశారు. ఎన్నికల బాధ్యత తీసుకున్న మంత్రులు అఖిలప్రియకు పడనివారి సహకారంతోనే పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని అఖిలప్రియ టీడీపీలో ఒంటరి అయిందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. కేవలం భూమా నాగిరెడ్డి మరణించిన కారణంగానే ఆమెకు మంత్రిపదవి ఇచ్చారు తప్ప పార్టీలో ప్రాధాన్యం లేదంటున్నారు.
ఎన్నికలో టీడీపీ ఓడిపోతే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఈమె భీష్మ ప్రతిజ్ఞ చేసింది. కాని ఆమెకు అంత సీన్‌ లేదు. టీడీపీ ఓడిపోయినా ఆమె అందుకు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించలేదు కాబట్టి ఆ బాధ్యత సీఎం చంద్రబాబు, మంత్రులు తీసుకోవాల్సిందే. ఏవిధంగా చూసినా అఖిల మంత్రిప‌ద‌వి సేపెగా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -