Wednesday, May 15, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్ సినిమా కోసం తార‌క్ ప‌డుతున్న క‌ష్టం

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎంత‌టి క‌ష్ట‌నైనా భ‌రిస్తాడు అనేది మ‌నం చాలాసార్లు చూసాం.కెరీర్ మొద‌ట్లో చాలా సినిమాల్లో చాలా లావుగా క‌నిపించిన తార‌క్ య‌మ‌దొంగ సినిమా త‌రువాత చాలా స‌న్న‌గా మారాడు.ఆ సినిమా త‌రువాత పెద్ద‌గా లుక్ మార్చ‌లేదు.ఇంకా చెప్పాలంటే మ‌ళ్లీ కొంచెం బొద్దుగా ఉన్నాడు తారాక్‌.ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం మ‌ళ్లీ త‌న లుక్‌ను మార్చ‌ల‌నుకుంటున్నాడు.దాని కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ త‌న ఫిజిక్‌కు ప‌దును పెడుతున్నాడు.తారక్‌ జిమ్‌లో కష్డపడుతున్న ఓ ఫొటోను లాయిడ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.  ఫొటోలో తారక్‌ కాళ్లతో కసరత్తులు చేస్తూ నొప్పి తట్టుకోలేక అరుస్తున్నట్లుగా కన్పిస్తున్నారు.

లాయిడ్‌ ఆయనకు సాయపడుతున్నారు.ఈ సినిమాలో తారక్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ను సెలెక్ట్ చేపినట్లు తెలుస్తుంది.ఈ సినిమా క్రైమ్  థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తుంది.ఈ సినిమాలో కొత్త లుక్ క‌నిపించ‌డానికి ఎన్టీఆర్ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.టెంప‌ర్‌,నాన్న‌కు ప్రేమ‌తో,జ‌నతా గ్యారేజ్‌,జై ల‌వ‌కుశ హిట్ల‌ల‌తో  ఎన్టీఆర్ మార్కెట్  బాగా పెరిగింది.

 

 

 
 
 
 
 
 
 
 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -