Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీ ఎంపీల రాజీనామాల‌పై ట్విట్ట‌ర్‌లో స్పందించిన వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. రాజీనామాల తర్వాత నేరుగా ఏపీ భవన్‌కు బయలుదేరిన ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ట్విట్ట‌ర్‌లో జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ముందుగా చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాలను నేడు స్పీకర్ కు సమర్పించారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ఇక తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా హక్కని, ప్రజల పక్షాన నిలబడాలని టీడీపీకి పిలుపునిచ్చారు. కాగా, ఏపీకి హోదాను డిమాండ్ చేస్తూ, వైసీపీ సభ్యులు కొద్దిసేపటి క్రితం తమ రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -