Tuesday, May 14, 2024
- Advertisement -

జనత గ్యారేజీ టైటిల్ కాదు – కొరటాల శివ

- Advertisement -

మిర్చి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన కొరటాల శివ సినిమా కి ఎన్టీఆర్ సంతకం పెట్టిన విషయం తెలిసిందే .. ఇవాళ ఉదయం ఈ సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది.

ఈ సినిమా కి హీరోయిన్ తో పాటు మిగిలిన తారాగణం ఎవ్వరూ ఇంకా ఓకే అవ్వలేదు. సుకుమార్ సినిమా ” నాన్నకు ప్రేమతో” లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ దాదాపు డిసెంబర్ లో  మొదలపెడతాడు అని తెలుస్తోంది. 

ఇప్పటికే ‘జనతా గ్యారేజీ’ అంటూ టైటిల్ పెట్టడం తో ఇది ఎంత వరకూ నిజం అని కొరటాల శివ ని మీడియా అడగగా జనతా గ్యారేజీ అనే టైటిల్ ఫాన్స్ కి నచ్చలేదు అని దాంతో దాన్ని కేవలం వర్కింగ్ టైటిల్ గా మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం అని అసలైన టైటిల్ ని ఇంకా ఏమీ అనుకోలేదు అని త్వరలో వెల్లడి చేస్తాం అని అన్నారు. అభిమానులను నిరాశ పరిచే టైటిళ్లు పెట్టనని ఈ సందర్భంగా కొరటాల శివ తెలియజేశారు.

 సో.. ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలైంది కాని డిసెంబర్ లో రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -