Friday, May 3, 2024
- Advertisement -

అల్లు అర్జున్ సాంగ్.. ఎన్టీఆర్ ఎంత ఇష్టమంటే..?

- Advertisement -

అభిమానుల్లోనే కాకుండా.. ఇతర వ్యక్తుల్లో కూడా మెగా ఫ్యామిలీ హీరోలు నందమూరి హీరోల గురించి.. నందమూరి వాళ్లు మెగా ఫ్యామిలీ హీరోలు మాట్లాడుకుంటే.. మంచి ఆసక్తి కలుగుతోంది. ఒక హీరో గురించి ఇంకో హీరో మాట్లాడితే.. క్యూరియాసిటీ పెరుగుతుంది.

రీసెంట్ గా ఎన్టీఆర్.. అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాట గురించి ‘బిగ్ బాస్’ షోలో ప్రస్తావించడం ఆసక్తి రేకెత్తించింది. అల్లు అర్జున్ పేరెత్తకుండా అతడి సినిమా ‘ఆర్య-2’లోని మిస్టర్ పర్ఫెక్ట్ పాటంటే.. తనకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. ఆ పాటలోని.. తనకు చాలా ఇష్టమైన లైన్లను ఎన్టీఆర్ పాడి కూడా వినిపించడం విశేషం.. ఇంతకీ ఆ షోలో ఈ పాట ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఈ ఆదివారం.. రాత్రి బిగ్ బాస్ షో నుంచి సింగర్ కల్పన ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటికి వచ్చేసిన.. అనంతరం.. ఎన్టీఆర్‌తో ముచ్చటిస్తున్న సందర్భంలో లోపలున్న మాజీ సహచరుల గురించి పాట రూపంలో చెప్పాలని అడిగాడు ఎన్టీఆర్.

అలా ఒక్కొక్కరిపై ఒక్కో పాట పాడుతూ.. ఆదర్శ్ విషయానికొచ్చే సరికి ‘ఆర్య-2’ టైటిల్ సాంగ్ పాడింది కల్పన. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మధ్యలో జోక్యం చేసుకుని తనకీ పాట ఇష్టమని.. అందులోనూ ‘మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండోయ్.. చీటండోయ్.. చీపండోయ్.. గజిబిజి పజిలండోయ్’ అనే లైన్లు మరీ ఇష్టమని చెప్పాడు ఎన్టీఆర్. టాలీవుడ్ లో తన పోటీ హీరోయిన అల్లు అర్జున్ సినిమాలోని పాట తనకు ఇష్టమని.. ఆ పాట లిరిక్స్ పాడి మరి వినిపించడం నిజంగ ఎన్టీఆర్ గొప్పతనం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -