Wednesday, May 15, 2024
- Advertisement -

స్పైడర్ గురించి ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకోసం ప్రచారం చేస్తున్నారు ఎన్టీఆర్. పైగా దరసరా బరిలో రాబోతుండటంతో.. క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు స్పైడర్ మూవీపై షాకింఘ్ కామెంట్స్ చేశాడు. స్పైడర్ సినిమాతో పోటీ కాదని.. ఎన్టీఆర్ చెబుతున్నాడు. సినిమాలో కంటెంట్ ఉంటే.. ఎన్ని సినిమాలు అయినా ఆడతాయని.. జనాలు ఆదరిస్తారని అంటున్నాడు. సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అన్నిటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కిన విషయాన్ని గుర్తు చేశాడు యంగ్ టైగర్. “చిరంజీవి గారి కెరీర్ లో ఖైదీ నంబర్ 150 బిగ్గెస్ట్ హిట్. బాలకృష్ణ గారి కెరీర్ లో గౌతమి పుత్ర శాతకర్ణి బిగ్గెస్ట్ హిట్. శర్వానంద్ కు శతమానం భవతి బిగ్గెస్ట్ హిట్. అన్ని సినిమాలు బాగా ఆడాయి” అన్నాడు ఎన్టీఆర్.

ఒకే రోజున 100 సినిమాలు రిలీజ్ అయినా.. వాటిలో కంటెంట్ ఉంటే అన్ని సినిమాలు ఆడేస్తాయన్నది ఎన్టీఆర్ చెప్పిన మాట. స్పైడర్ కూడా.. మంచి హిట్ అవుతుందని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక ఎన్టీఆర్ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉన్నా.. థియేటర్ల సంఖ్య పరిమితం కావడంతో.. కలెక్షన్స్ పంచుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్ల బాధ అంతే. సో మరి ఈ రెండు సినిమాలో ఏ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -