Wednesday, May 15, 2024
- Advertisement -

రజినీకి ముద్దు పెట్టిన ఈ అమ్మాయి ఎవరు..?

- Advertisement -

తమ అభిమాన హీరో మనకి కనిపిస్తే వెంటనే ఎవరైన ఏం చేస్తారు.. అతనితో ఓ ఫోటో దిగాలని అనుకుంటారు.. వారితో రెండు మాటలు మాట్లాడాలని ఆశపడుతారు. ఆ క్షణాన్ని చిరకాలం గుర్తిండిపోయేలా చేసుకుంటారు. చాలా అభిమానం ఉన్న హీరో అనుకోకుండా ఎదురుపడితే.. చటుక్కున బుగ్గపై ఓ స్ట్రాంగ్ ముద్దు పెట్టుకోవడమో.. పెట్టించుకోవడాన్ని పెద్దగా అబ్జెక్షన్ చేయలేం.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ అమ్మాయి స్ట్రాంగ్ గా ముద్దిచ్చేయడం సెన్సేషన్ అవుతోంది. తనకంటే దాదాపు 3 రెట్ల వయసు ఉన్న ఈ సూపర్ స్టార్ కు.. ఓ సీరియల్ యాక్ట్రెస్.. బుగ్గమీదస్ట్రాంగ్ ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం కాలా కరికులన్ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ సందర్భంగా.. జీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అయిన చైత్రా రెడ్డి.. అక్కడకు వచ్చింది. రజినీకాంత్ తో ఫోటో దిగాలన్న తన కోరికను వెలిబుచ్చింది. అంతేకాకుండా.. ఆయన బుగ్గ మీద ఓ ముద్దిస్తూ ఫోటో దిగాలన్న తన కోరికను కూడా తెలిపింది.

దీనికి నవ్వుతూనే రజినీ సరే అన్నారు. అయితే.. రజనీ ఊహించని స్థాయిలో.. గట్టిగా బుగ్గను ముద్దాడేసింది చైత్రా రెడ్డి. సూపర్ స్టార్ తన సహజ శైలిలో నవ్వుతూనే ఉన్నా.. ఆ ముద్దు పెట్టేటపుడు అమ్మడి తన్మయత్వం చూస్తే.. ఎంతటి అభిమానమో అనిపించక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో ట్రెండింగ్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -