Thursday, May 9, 2024
- Advertisement -

వాణి విశ్వ‌నాథ్‌ను ఎదుర్కొనేందుకు రోజా వ్యూహాలు

- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా రాజ‌కీయాల‌ల్లో త‌న‌కంటు ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొద‌ట టీడీపీలో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టిన త‌ర్వాత రోజా పార్టీని వీడారు. చంద్ర‌బాబు రాజ‌కీయంగా త‌న‌ను ఉప‌యేగించుకొన పార్టీనుంచి బ‌య‌ట‌కు పంపార‌ని ఆమె అనేక‌సార్లు వెల్ల‌డించారు. వైసీపీలోకి జంప్ చేసిన ఆమె చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి పోటీ చేసి సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అయిన గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడిని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టి పెద్ద సంచ‌ల‌న‌మే క్రియేట్ చేశారు.

గ‌త కొద్దిరోజులుగా రోజా చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటె 2019 ఎన్నిక‌ల్లో రోజాను ఓడించేందుకు టీడీపీ కంక‌నం క‌ట్టుకుంది. అందుకే ఆమెకు ప్ర‌త్య‌ర్థిగా బ‌ల‌మైన అభ్య‌ర్తిని నిల‌బెట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఎమ్మెల్సీ అయినా ఆయ‌న అనారోగ్యం రీత్యా చురుగ్గా నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేక‌పోతున్నారు. ఆయ‌న త‌న‌యుడు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం రోజాకు సినీగ్లామ‌ర్ నే చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు.

అందుకే రోజా త‌రంలో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సీనియ‌ర్ న‌టి వాణీ విశ్వ‌నాథ్‌ను టీడీపీ నాయ‌కులు పార్టీలోకి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇక వాణీ కూడా తాను చంద్ర‌బాబు ఆదేశిస్తే న‌గ‌రిలో రోజాపై పోటీ చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో సినీగ్లామ‌ర్‌తో రోజా ఎలా గెలిచిందో ఇప్పుడు టీడీపీ కూడా అదే సినీ గ్లామ‌ర్‌తో గెల‌వాల‌ని వాణివిశ్వ‌నాథ్‌ను పోటీకి దింపుతోంది.

నిన్న‌,మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనె ఉన్న రోజా ఇప్పుడు త‌న సొంత నియేజ‌క‌వ‌ర్గం న‌గ‌రిపై ప్ర‌త్యేక‌దృష్టి సారించారు. నగరికి వచ్చినప్పుడు ఆమె అద్దె ఇంట్లోనే ఉంటున్న రోజా సొంత ఇల్లు ఉంటె వస్తున్నారు ప్ర‌జ‌ల్లో తాను స్థానికురాలిన‌న్న భావ‌న బ‌లంగా ఉంటుంద‌ని భావించిన ఆమె ఇక్క‌డ సొంత ఇళ్లు నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. ఇక మూడు నెల‌ల పాటు కంటిన్యూగా ఉండే వైఎస్సార్ కుటుంబంలో పాల్గొని నియోజ‌క‌వ‌ర్గం మొత్తం చుట్టి వ‌చ్చేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నారు.

ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆమె మీడియా ముందుకు రావ‌డం మానేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా టైం లేక‌పోవ‌డంతో ఆమె న‌గ‌రికే ప‌రిమిత‌మ‌య్యేలా ప్ర‌ణాళిక వేసుకున్నార‌ని తెలుస్తోంది. న‌గ‌రిలోనే త‌ర‌చూ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ అభివృద్ధిప‌నుల‌పై ఫోక‌స్ పెట్టారు. ముందు త‌న ఇళ్లు చ‌క్క‌బెట్టుకొనే ప‌నిలో ప‌డ్డారు. చంద్ర‌బాబు ఎత్తుల‌ను ఢీకొట్టాలంటె చిన్న‌విష‌యం కాదుగా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -