Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పిన పవర్ స్టార్

- Advertisement -

టెంపర్ కి ముందువరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరు, టెంపర్ నాన్నకుప్రేమతో సినిమాల విజయాల తరువాత ఇప్పుడు ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వేరు. సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకటిగా ఎన్టీఆర్ ను నిలిచేలా చేసిన నాన్నకుప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ కి సౌత్ లో ఫాలోయింగ్ పదింతలు పెరిగింది.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ చేస్తున్న జనతాగ్యారేజ్ కేరళలో కూడా రిలీజ్ అవుతుండటంతో అక్కడ కూడా పాపులర్ అవ్వడం ఖాయం. కాగా ఈ మధ్య ఎన్టీఆర్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన గెలెయ గెలెయ పాటతో అక్కడ తన పాపులారిటీని పెంచుకున్నాడు. కాగా తన 25 వ సినిమాలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పాట పాడటంతో పునీత్ కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్ అయిపోయాడు.

దాంతో ఈ మధ్యన ఆడియో వేడుకలో ఎన్టీఆర్ తో కలిసి నటించే చాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తానని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన పవర్ తన సినిమా టైటిల్ కార్డ్ లో ఫుల్ స్క్రీన్ పై థాంక్ యు తలైవా అంటూ తన స్నేహాన్ని చాటుకోబోతున్నాడట. ఎన్టీఆర్ పాడిన పాటతో తన సినిమాకు పదింతలు క్రేజ్ రావడంతో తన సంతోషాన్ని ఇలా పంచుకోబోతున్నాడు పవర్ స్టార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -