- Advertisement -

స్వాతిముత్యం, సాగర సంగమం నిర్మాత ఇక లేరు..

- Advertisement -

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి భౌతికకాయన్ని తరలించారు. 

ఎన్టీఆర్ నటించిన ‘ఆత్మబంధువు’ చిత్రంతో తెర వెనుక నుండి తెరపైకి వచ్చారు. 1960 – 1974 మధ్య కాలంలో దాదాపు 30 చిత్రాల్లో గుర్తింపు కలిగిన వేషాలు వేశారు. 

 1976లో విడుదలైన ‘సిరిసిరిమువ్వ’ విజయం సాధించింది. అనంతరం పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘తాయారమ్మ – బంగారయ్య’ చిత్రాన్ని నిర్మించారు. 

ఇక అప్పటి నుండి నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు జైత్రయాత్ర మొదలైంది. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఆపద్భాంధవుడు, స్వరకల్పన, స్వయం కృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, సాగర సంగమం, సితార, సీతాకోక చిలుక, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర సినిమాలను నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -