Sunday, May 5, 2024
- Advertisement -

పవర్ స్టార్ సినిమాలో ఎన్టీఆర్ పాట

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనతో పాటు పాటలు కూడా చాలా బాగా పాడుతారు. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన సినిమాలో ఒక పాట పాడమని ఎన్టీఆర్ ని కోరాడట. పునీత్ కోరిన వేంటనే పాడుతా అని మాట కూడా ఇచ్చాడు ఎన్టీఆర్.

పునీత్ రాజ్ కుమార్ హీరోగా  ‘చక్రవ్యూహ’ అనే సినిమా తెరకేక్కుతుంది. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ పునీత్ కోసం పాట పాడారు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది  ‘చక్రవ్యూహ’ అనే చిత్రం పునీత్ కు  25వ చిత్రం, ఎన్టీఆర్ కుడా  ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం 25వ చిత్రం.  ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ లో బిజీగా ఉన్న పునీత్ కోసం ఈ పాట పాడారు ఎన్టీఆర్.

ఈ  ‘చక్రవ్యూహ’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ పాడిన ఈ పాట సంబంధించి ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్, థమన్, పునీత్ ముగ్గురు కలిసి సెల్ఫీ ఫోటోలు దిగారు.

ఈ పాటను అతి త్వరలోనే యూట్యూబ్ లో రీలిజ్ చేయనున్నారు. కన్నడ స్టార్ హీరో కోసం పాడిన ఈ పాట మంచి విజయం సాదిస్తుందని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -