Wednesday, May 22, 2024
- Advertisement -

రవితేజతో మరో మూవీ

- Advertisement -

రవితేజను కొత్త కోణంలో చూపించిన సినిమా మిరపకాయ్. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. రవితేజకి సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు. ఈ సినిమా తో తన టాలెంట్ ఎంటో నిరుపించుకున్నాడు హరీష్. తాజాగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తో మంచి విజయం అందుకున్నాడు.

ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో హరీష్ తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ముందుకు వస్తున్నారు. తాజా సమాచరం ప్రకారం రవితేజతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట హరీష్. అయితే ప్రస్తుతం రవితేజ దిల్ నిర్మించే సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకి ఓప్పుకున్నాడు.

ఈ రెండు సినిమాలు కాంప్లీట్ చేసాన తర్వాత హరీష్ , రవితేజల మూవీ మొదలు కానుంది. అంటే రవితేజతో సినిమా చేయాలి అంటే హరీష్ ఇంకో సంవత్సరంపైనే వేచి ఉండాలి. మరి రవితేజ కోసం వేట్ చేస్తాడా లేక వేరే హీరోతో సినిమా చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -