Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి టోటల్ స్టోరీ నరేషన్ చేశాడట!

- Advertisement -

గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హరీష్ శంకర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన రామయ్యావస్తావయ్యా సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలను తలకిందలు చేస్తూ ఆ సినిమా ఆల్ టైం డిసాస్టర్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా ఎన్టీఆర్ ఇమేజ్ ని పూర్తిగా డామేజ్ చేసింది.

దాంతో అప్పటివరకు స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న హరీష్ కెరీర్ కూడా డైలమాలో పడింది. ఆ ఇన్సిడెంట్ తరువాత ఎలాగైనా ఎన్టీఆర్ తిరిగి ఓ సూపర్ హిట్ ఇవ్వాలని ఎంతో కష్టపడి కొన్ని కథలు రెడీ చేసుకున్నాడు హరీష్ శంకర్. కానీ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉండటంతో హరీష్ కథలను విన్నా పెద్దగా ఎన్టీఆర్ కి నచ్చేవి కాదు.

కానీ ఇన్నాళ్ళకి హరీష్ చెప్పిన కథకి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ మధ్యనే జనతాగ్యారేజ్ సెట్స్ లో ఎన్టీఆర్ ని కలిసిన హరీష్ రెండు గంటల టైం తీసుకుని ఎన్టీఆర్ కి టోటల్ స్టోరీ నరేషన్ చేశాడట, కాగా ఈసారి ఎన్టీఆర్ కథ మొత్తం విని అద్బుతంగా ఉందని మనం కచ్చితంగా చేస్తున్నామని మాట ఇచ్చాడట. మరి ఈసారి అయినా ఎన్టీఆర్ కి నికార్సయిన హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -