Tuesday, April 30, 2024
- Advertisement -

‘అర‌వింద స‌మేత‌’లో చిన్న‌ప్ప‌టి రోల్‌లో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్‌

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా న‌టించిన చిత్రం ‘అర‌వింద స‌మేత‌’.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను చిన‌బాబు హారికా అండ్ హాసిని బ్యాన‌ర్ మీద నిర్మిస్తున్నారు.గ‌త మంగ‌ళ‌వారం జ‌రిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల స‌మక్షంలో చాలా ఘ‌నంగా జ‌రిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చాలా ఎమోష‌నల్‌గా మాట్లాడారు. ఇటీవ‌లే మ‌ర‌ణించిన త‌న తండ్రి హ‌రికృష్ణ‌ను గుర్తు చేసుకుంటు స్టేజీ మీదే క‌న్నీరు పెట్టుకున్నారు ఎన్టీఆర్‌.ఇక సినిమా విష‌యానికి వ‌స్తే …రాయ‌ల‌సీమ‌లో జ‌రిగే ఫ్యాక్ష‌న్ క‌థ అని తెలుస్తుంది.కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు ట‌చ్ చేయ‌ని పాయింట్‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తీసుకున్నార‌ని స‌మాచారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియ‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు,క‌థ ప‌రంగా ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి సీన్స్ కొన్ని సినిమాలో ఉంటాయ‌ని స‌మాచారం.ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి పాత్రలో ఆయ‌న త‌న‌యుడు అభయ్ రామ్ న‌టించాడ‌ని సినీ వ‌ర్గాలు వినికిడి. సినిమా విడుద‌ల స‌మ‌యంలో చెబితే ఫ్యాన్స్ థ్రిల్‌గా భావిస్తారని ,ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచిన‌ట్లు తెలుస్తుంది.మ‌రి ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి రోల్‌లో అభయ్ రామ్ క‌నిపిస్తే నంద‌మూరి అభిమానుల‌కి డ‌బల్ పండుగ వ‌చ్చిన‌ట్లే.మ‌రి ఈ వార్తలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాను ద‌స‌రాకు కానుక‌గా ఈ నెల 11న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -