Wednesday, May 15, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘నోటా’ మూవీ రివ్యూ

- Advertisement -

అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. దీనితో నోటా చిత్రపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆనంద్ శంకర్ దర్శత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన నోటా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. నోట్లపై సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వరుణ్ (విజయ్ దేవరకొండ) అనుకోకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. జీవితాన్ని విలాసాలతో ఎంజాయ్ చేసే వరుణ్ సీఎం పదవిని తేలికగా తీసుకొంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తుంది. తన ఎదుట నిలిచిన ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ

నటీనటుల ప్రతిభ
ప్రాథమిక అంతర్గత సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ అద్భుతమైన పాత్రకు జీవం పోశారనే మాట వినిపిస్తున్నది. విజయ్ నటన నోటాకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని చెప్పుకొంటున్నారు. నాజర్, సత్యరాజ్ కీలకమైన పాత్రలో కనిపించారు. మెహ్రీన్ పిర్జాదా గ్లామర్ అదనపు ఆకర్షణ. పులికొండ ప్రియదర్శి, యషికా ఆనంద్, అనస్తాసియా మాస్లోవా, సంచాన నటరాజన్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.గత చిత్రాల కంటే భిన్నంగా విజయ్ దేవరకొండ యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. సినీ తెరపై ఇంత తక్కువ వయసులో ఓ హీరో సీఎంగా కనిపించిన దాఖలాలు లేవు.విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉంది వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయమంటున్నారు.

సాంకేతిక నిపుణులు
ఆనంద్ శంకర్ దర్శకత్వం తమిళంలో ఇరుమురగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. షాన్ కురుప్పుస్వామి అందించిన కథను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా భావోద్వేగాలను పండించాడు ద‌ర్శ‌కుడు. కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మాణ విలువులు సినిమా స్థాయికి త‌గిన‌ట్లుగానే ఉన్నాయి.

బోట‌మ్ లైన్
కాస్తా త‌మిళ ఫ్లేవ‌ర్ త‌క్కువ అయితే బాగుండేది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -