Tuesday, April 30, 2024
- Advertisement -

‘అర‌వింద‌ స‌మేత‌’లో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్‌

- Advertisement -

ఎన్టీఆర్ తాజాగా న‌టించిన చిత్రం అర‌వింద స‌మేత‌.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న విడుద‌ల చేస్తున్నారు.ఇటీవ‌లే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను యూట్యుబ్‌లో విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్.. తండ్రి పట్టిన కత్తి పట్టి త్రివిక్రమ్ ఒడిలో కూర్చొని ‘స్టార్ట్ కెమెరా’ అంటూ పలకడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా అభయ్ రామ్ సెట్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సినిమా త‌న‌కు హిట్ ఇస్తుంద‌ని ధీమాతో ఉన్నాడు ఎన్టీఆర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -