Tuesday, April 30, 2024
- Advertisement -

ముగిసిన కోడెల స్టే గ‌డువు….

- Advertisement -

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో చుక్కెదురైంది. కోడ్ ఉల్లంఘన కేసులో అక్టోబర్ 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని, గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా వ్యాఖ్యానించగా, సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాదరావు చెప్పిన అంశాలను పిటిషనర్ కోర్టుకు ఆధారాలతో సహా వివరించారు.

ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద విచారణ సాగగా, ఈ కేసులో విచారణ నిలుపుదల చేయాలంటూ కోడెల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గత నెల 27తో స్టే గడువు ముగిసింది. ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని న్యాయమూర్తి కోడెలను ఆదేశించారు.

అంత పెద్ద మొత్తంలో డబ్బును ఎందుకు ఖర్చు పెట్టారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి ఇచ్చారో విచారించాలని, డబ్బుపై ఐటీ అధికారులతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -