Friday, April 26, 2024
- Advertisement -

రివ్యూ: ‘పలాస 1978’ లో తీయని పాట

- Advertisement -

రక్షిత్ మరియు నక్షత్ర ని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘పలాస 1978’. కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్కి తగ్గట్టుగా ని ఈ సినిమా పలాస అనే గ్రామం బ్యాక్ డ్రాప్తో 1970లో కాలంలో సాగుతుంది. కేవలం పోస్టర్ల తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకనిర్మాతలు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రఘు కుంచే అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగానే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గొంతు ఈ పాటకి ప్రాణం పోసింది. ముఖ్యంగా బేబి గొంతు ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చుంది. లక్ష్మీ భూపాలం లిరిక్స్ మనసును హత్తుకునే విధంగా ఉంటాయి. తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -