Tuesday, April 23, 2024
- Advertisement -

ధోనికి బిగ్ షాక్…. అంతర్జాతీయ క్కికెట్ కు ఇక రిటైర్ మెంట్ ప్రకటించాల్సిందే

- Advertisement -

విండీస్‌ పర్యటనకు వ్యక్తిగత కారణాలతో దూరమైన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి సెలక్టర్లు మరో సారి బిగ్ షాక్ ఇచ్చారు. ప్రపంచకప్ లో పేవల ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం.ఆటగాళ్ల ఎంపిక, బెంచ్‌ బలాన్ని పెంచుకోవడం, బలహీనంగా ఉన్న విభాగాలను పటిష్ఠ పరుచుకోవడం, బ్యాటింగ్‌ ఆర్డర్‌ను గాడిలోకి తేవడం సెలక్టర్లకు అత్యంత ముఖ్యం.

దీనిలో భాగంగానె ఇప్పటినుంచే యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వచ్చే నెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధోనీకి స్థానం దక్కే సూచనలు కనిపించడం లేదు. ధోని స్థానంలో మరోసారి పంత్ నే తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు.ఇందులో భాగంగా విండీస్‌తో తలపడిన జట్టునే యథాతథంగా సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

నేపథ్యంలో వచ్చే నెలలో మూడు టీ20లు(15, 18, 22), మూడు టెస్టులు ఆడేందుకు దక్షిణాఫ్రికా భారత్‌కు రానుంది. వచ్చే నెల 15 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుండగా… ఈ సిరీస్‌ కోసం జట్టును 4వతేదీన సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -