Saturday, May 18, 2024
- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న రాజస్థాన్ యువకుడు

- Advertisement -

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత, కశ్మీర్ అమ్మాయిలకు, రాష్ట్రేతరులను వివాహం చేసుకునే అవకాశం లభించింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ లో స్వేచ్చా వాయువులు పీలుస్తున్న యువతీ యువకులు వారి వారి మనోబావాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు నిర్బయంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.తాజాగా రాజస్థాన్ యువకుడు కాశ్మీరీ అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు చెందిన అక్షయ్, కొంతకాలం ముందు న్యూఢిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్ కు చెందిన కామినీ రాజ్ పుత్, ఢిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోతుందని తల్లిదండ్రులు భయపడి పెళ్లికి అడ్డు చెప్పారు. మోదీ నిర్ణయంతో వీరి పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి.

ఇప్పుడు తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని, మోదీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అక్షయ్ అంటున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు ఎంగేజ్ మెంట్ జరుగగా, మరో రెండు వారాల్లో వివాహాన్ని వైభవంగా నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఓ కశ్మీర్ అమ్మాయిని పెళ్లాడటం ఇదే ప్రథమం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -