Friday, April 19, 2024
- Advertisement -

మెగా అభిమానులకు ఆచార్య విషయంలోనూ నిరాశే..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి “ఆచార్య” సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ లను పూర్తి చేసుకుని మే 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇదివరకే చిత్రబృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించారు.

దేశంలో కరోనా ఉద్ధృతి అధికమవడంతో ఇప్పటికే పలు సినిమా షూటింగులు వాయిదా వేయగా విడుదలకు సిద్ధంగా ఉన్న మరి కొన్ని సినిమాలను కూడా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి ఈ క్రమంలోనే చిత్రబృందం సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

మే 14 న విడుదల కావాల్సిన చిరంజీవి ఆచార్య సినిమాను ప్రస్తుతం వాయిదా వేస్తూ.. ఈ సినిమాను తిరిగి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. ఇది మెగా అభిమానులకు కొంత నిరాశ పరిచిన.. చిరు పుట్టిన రోజు విడుదల అవుతుందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -