Friday, March 29, 2024
- Advertisement -

నానీ స్పీడ్‏కు ఆ హీరోయిన్ బ్రేక్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు నాని. కరోనా నేపథ్యంలో ఓటీటీ లో ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున ‘అంటే .. సుందరానికీ!’ సినిమా షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగును చాలా తక్కువమంది సిబ్బందితో కానిస్తున్నారు.

‘అంటే .. సుందరానికీ!’ మూవీలో నాని సరసన నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఇటీవలే ఆమె హైదరాబాద్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా కేసుల తీవ్రత చూసిన నజ్రియా, ఇలాంటి పరిస్థితుల్లో తాను షూటింగ్ చేయలేనని చెప్పేసి వెళ్లిపోయిందని అంటున్నారు. దాంతో ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది.

దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్.. కొన్ని రోజుల పాటు షూట్ కు బ్రేక్ ఇచ్చారని టాక్. ఇటు నజ్రియా భర్త ఫాజిల్.. పుష్ప మూవీలో విలన్ గా చేస్తున్నారు. ఇలా భార్య భర్తలిద్దరూ ఒకేసారి తెలుగు చిత్రాల్లో నటిస్తుండటం.. ఆసక్తి రేపుతోంది. దీంతో నాని సహా ‘అంటే సుందరానికీ’ టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. కాగా ఇందులో నటి నదియా కీలక పాత్ర పోషిస్తుంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయి : షర్మిల

పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -