Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ కు గవర్నర్ నుంచి లేఖ!

- Advertisement -

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ తో పాటు మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే ఇప్పుడు అందరికి తెలుసు. అయితే కెన్యాలోని నారోక్ కౌంటీ గవర్నర్ రాసిన లేఖ ఇప్పుడు ప్రభాస్ అభిమానులను సంతోషపెడుతుంది.

ఆ లేఖలో ఏం రాసి ఉందటే.. తమ కెన్యాలోని ఓ నేషనల్ పార్క్‌కు విచ్చేయాలని, కుదిరితే ‘బాహుబలి-2’లో కొన్ని సన్నివేశాల కోసం ఆ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరాడు కూడా. ఇది నిజంగా ప్రభాస్‌కే కాకుండా టాలీవుడ్‌కి అరుదైన గౌరవంలాంటిదని చెప్పుకోవచ్చు.

కెన్యాలో ‘మాసాయ్ మరా’ పేరిట అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం వుంది. అది.. సింహాలు, పులులు, చిరుతలు వంటి క్రూర మృగాలకు, ఇంకా వివిధ రకాల జంతువులు, పక్షులకు ప్రసిద్ది. అంతేకాదు.. ఎత్తయిన పర్వత ప్రాంతాలు, ప్రకృతి రమణీయతకు కూడా ఇది పాపులర్. అలాంటి ప్రాంతానికి ప్రభాస్ ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సుమారు రెండు వారాలు గడిపి వచ్చాడు. ‘బాహుబలి-2’ షూటింగ్‌కు దర్శకుడు రాజమౌళి 45 రోజులు బ్రేక్ ఇవ్వడంతో ప్రభాస్ ఇలా తన ముచ్చట తీర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతపు గవర్నర్ శామ్యుల్ టునాయ్.. ప్రభాస్‌కి ఓ లేఖ రాశాడు.

‘‘డియర్ ప్రభాస్.. నువ్వు మాసాయ్ మరా నేషనల్ పార్కుకు రావడం మాకు గర్వకారణంగా వుంది. ఇతర పనుల్లో బిజీగా వుండడంతో నేను పర్సనల్‌గా నిన్ను కలవలేకపోయాను. ఈ ప్రాంతాన్ని మరోసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో నటించబోయే మీ తదుపరి సినిమాల్లో పాటల లేదా ఇతర సీన్ల షూటింగ్ కోసం వినియోగించుకుని.. మా ప్రాంతాన్ని పాపులర్ చేస్తావని ఆశిస్తున్నా. బాహుబలి 2 రిలీజ్ కోసం.. ఆ సినిమా ఇంగ్లీష్ డబ్బడ్ వర్షన్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా’’ అంటూ ఆ గవర్నర్ తన లేఖలో పేర్కొన్నాడు. మరి.. దీనికి ప్రభాస్ రెస్పాన్స్ ఏంటో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -