Tuesday, May 14, 2024
- Advertisement -

స‌న్నీలియోన్ పెళ్లి రోజు కూడా వ‌ద‌ల్లేదు

- Advertisement -

బాలీవుడ్‌లో సన్నీ లియోన్ త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చ‌కుంది.పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చింది.అప్ప‌టి నుండి తెలుగు , త‌మిళ్‌,ఇలా అన్నీ భాష‌ల‌లో సినిమాలు చేస్తు బిజి హీరోయిన్‌గా మారింది.బుధవారం సన్నీ దంపతుల పెళ్లి రోజు. తన భర్త డేనియల్‌ వెబర్‌కు ప్రత్యేక సందేశం పంపారు.వీరి పెళ్లి అయ్యి ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డంతో , ఈ సందర్భంగా తన భర్తకు శుభాకాంక్షలు చెబుతూ సన్నీ ట్వీట్‌ చేశారు. పెళ్లి రోజున దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరినొకరం ఎప్పటికీ ప్రేమించుకుంటూనే ఉంటామని ప్రమాణం చేశామ‌ని, నిన్ను పెళ్లి రోజు ఎంత ప్రేమించానో ఈ రోజు అంత‌క‌న్నా ఎక్కువుగా ప్రేమిస్తున్నా అని ట్వీట్ట‌ర్ ద్వారా ప్రేమ‌ను త‌న భర్త‌కు తెలియ‌జేసింది.సన్నీ దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. మహారాష్ట్రలోని లాథూర్‌కు చెందిన ఓ అనాథాశ్రమం నుంచి నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు. సరోగసీ పద్ధతి ద్వారా ఇటీవల వీరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -