Saturday, May 4, 2024
- Advertisement -

బ్రేకింగ్ : చెన్నైనుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు త‌ర‌లింపు…?

- Advertisement -

చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు కావేదెబ్బ త‌గిలింది. మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ వ‌ద్ద‌ని రాజ‌కీయ‌పార్టీలు, ఇత‌ర సంఘాలు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న జ‌రిగిన చెన్నైసూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆందోళ‌న కారులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను త‌ర‌లించేందుకు రంగం సిద్ధం అయ్యింది.

రెండేళ్ల త‌ర్వాత ఐపీఎల్ తిరిగి వ‌చ్చింద‌న్న ఆనందం చెన్నై ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో వేదికకు త‌ర‌లించినున్నారు. ముందుగా నిజానికి ఈ మ్యాచ్‌ల‌ను కూడా కేరళకు తరలిస్తారని వార్తలు వచ్చినా.. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఖండించారు. అయితే తాజాగా నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే స్టేడియం బయట ఆందోళనకారులు నిరసన తెలిపారు. దీంతో 4 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయినా మ్యాచ్ సందర్భంగానూ స్టేడియంలో కొందరు ఆందోళన నిర్వహించారు. ప్రేక్షకుల్లో కొందరు చెన్నై ప్లేయర్ జడేజాపై షూ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మ్యాచ్‌ల‌ను వేరేచోట నిర్వ‌హించేందుకు తీసుకుంది. ప్రస్తుతం బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. చెన్నైకు సరైన ప్రత్యామ్నాయ వేదికల కోసం చర్చ జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -