Tuesday, May 14, 2024
- Advertisement -

బరువు తగ్గించే నియామాలు!

- Advertisement -

* భయట తినటానికి వెళ్ళిన లేదా చిన్న చిన్న స్నాక్స్ తినటానికి వెళ్ళిన, మీరు తినే స్మూతీస్’లలో ప్రోటీన్’లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. మంచి రూచినే కాకుండా, మీ కడుపు నిండినట్టు అనిపించేలా చేస్తాయి. మీ శరీర బరువు తగ్గించాలి అనుకుంటున్నారు కావున, ఆహర స్వీకరణను పరిమితులను ఉంచుకోండి.

* మీరు ఎక్కడికైనా వెళ్ళిన, కారును పార్క్ చేసి, నడవటానికి ఎక్కువ సమయం కేటాయించండి. అంతేకాకుండా, మీరు ఏదైనా బరువు మోసినను మంచిదే.

* రాత్రి పడుకునే ముందు అనారోగ్యకర ఆహార సేకరణను ఆపేయండి. ఆరోగ్యకర స్నాక్స్ లేదా  ఆహారాలను తీసుకోండి.

* సాధారణంగా ఆఫీస్ ఉన్న రోజులలో కన్నా, సెలవు ఉన్న శని, ఆదివారాలలో ఎక్కువగా తినే అవకాశం ఉంది, కావున, బరువు తగ్గాలనే విషయాన్ని మనసులో ఉంచుకొని సెలవు రోజులలో మీ ఆహర స్వీకరణపై తగిన పరిమితులను నిర్దేశించుకోండి.

* పార్టీ లేదా వేడుకలలో మీకు నచ్చే ఆహార పదార్థాలు ముఖ్యంగా, అనారోగ్యకర ఆహార పదార్థాలు చాలానే ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువగా తినే అవకాశం ఉంది, కావున ఇలాంటి కార్యక్రమాలలో ఆహార స్వీకరణను తక్కువగా ఉండేలా జాగ్రత్త పడండి.

* కొవ్వు పదార్థాలను ఎక్కువగా కలిగి ఉన్న లేదా ఫాస్ట్ ఫుడ్’లకు దూరంగా ఉండండి, ప్రతి భోజనానికి కనీసం 15 నుండి 20 నిమిషాల సమయం తీసుకోండి.

* వారంలో ఆఫీస్ పనులు ముగిసిన తరువాత చాలా మంచి శుక్రవారం రోజు, సహా ఉద్యోగులతో పార్టీలు పెట్టుకుంటారు. పార్టీలో ఎక్కువగా సిగరెట్, ఆల్కహాల్’లతో పాటూ, అనారోగ్యకర ఆహరం ముఖ్యంగా కొవ్వు అందించే ఆహారాల ఎక్కువగా తీసుకుంటారు, ఫలితంగా మీ బరువు తగ్గే ప్రణాళికలో అపశ్రుతి కలిగే అవకాశం ఉంది.

* మీ శరీర బరువు తగ్గాలి అంటే, లిఫ్ట్, కారులో తిరగటం కన్నా, మెట్లు ఎక్కటం లేదా నడవటం వలన మీ శరీర బరువు తగ్గే అవకాశం ఉంది.

* ఆకలి వేసినపుడు, తక్కువ కొవ్వు కలిగిన ఆపిల్ జ్యూస్, పిడికెడు బాదంలతో నారింజ పండు రసం, క్యారెట్ లేదా తృణధాన్యాల వంటి వాటిని తీసుకువటం వలన పోషకాలు అందించబడి శరీర బరువు తగ్గే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -