Monday, April 29, 2024
- Advertisement -

రజనీ -దీపిక.. కాంబినేషన్ రిపీట్..!

- Advertisement -

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఈ పేరు చెబితేనే ఊర్రుతలూగిపోతారు తమిళ ప్రజలు. కేవలం తమిళనాడులోనే కాక .. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్​ ఉన్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్యం సహకరించకపోయినా.. ఈ వయసులో సైతం ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 70 ఏళ్లు వచ్చినా రజనీకి మార్కెట్​ తగ్గలేదు. ఇప్పటికీ రజనీ సినిమా వచ్చిందంటే చాలు.. ఈలలు, గోలలు సందడి మామూలుగా ఉండదు. రజనీ కాంత్ ప్రస్తుతం అన్మాత్తే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీ కాంత్ సరసన నయనతార నటిస్తుండగా.. ఖుష్బూ, మీనా, కీర్తిసురేశ్​ సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి పురస్కరించుకొని నవంబర్‌ 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ ఇక సినిమాలు చేయరు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని రజినీ మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కనులు కనులు దోచాయంటే దోచాయంటే ’ దర్శకుడు దేసింగు పెరియసామి ఓ సినిమాలో రజనీ కాంత్​ నటించబోతున్నాడట. పెరియసామి దర్శకత్వం నచ్చడంతో ఆయనతో మూవీ చేయాలని రజనీ భావిస్తున్నట్టు టాక్​.

ఈ సినిమా కోసం రజనీ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు టాక్​. ‘కోచ్చడయాన్‌’ (2014) మూవీలో రజనీ–దీపికా జంట కనిపించింది. ఈ సినిమాలో రజనీ,దీపిక మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో యానిమేటెడ్‌ క్యారెక్టర్స్‌గా కనిపించారు. ఇక తాజాగా మామూలు పాత్రలో కనిపించబోతున్నది దీపిక. ఈ సినిమా పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్​ ఉంది.

Also Read

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్​ సాంగ్ లో రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణ..!

రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -