రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

రాజమౌళి ఒక్క టాలీవుడ్ కే కాదు. దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇంతవరకు అపజయం లేని రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు దేశంలోని అన్ని భాషల నటీ నటులు ఎదురు చూస్తుంటారు. భారీ చిత్రాలను తెరకెక్కించే రాజమౌళి ఇండస్ట్రీ కి 20 ఏళ్లు అయినా చేసింది తక్కువ సినిమాలే. ఇప్పటి దాకా తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్ చరణ్, నాని, సునీల్ మాత్రమే హీరోలుగా నటించారు.

అగ్ర నటుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని చాలా ఏళ్లుగా మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజుల కిందట తన తదుపరి సినిమా మహేష్ తో అనే రాజమౌళి ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అయితే రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా కేటగిరి లోనే సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఎక్కువగా చారిత్రక కథలనే చేస్తుండటంతో మహేష్ తో చేసే సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అంతా భావించారు. దానికి తగ్గట్టు మహేష్ ఛత్రపతి శివాజీ గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అవేవి నిజం కాదని తేలింది. మహేశ్​ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రానికి ఇప్పటికే.. విజయేంద్ర ప్రసాద్​ కథను సిద్ధం చేశారట. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​ఆర్​ఆర్​ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్​ 13న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. మరోవైపు మహేశ్​బాబు.. పరుశురామ్​ దర్శకత్వంలో సర్కారువారిపాటలో నడిస్తున్నారు. వీరిద్దరూ ఫ్రీ అయిన తర్వాత కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Also Read

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

Related Articles

Most Populer

Recent Posts