Sunday, April 28, 2024
- Advertisement -

భీమ్​ విషయం ఓకే.. మరి అల్లూరి సంగతేంటి?

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ పేరుతో ఓ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కుమ్రం భీంగా తారక్​, అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్​ తేజ్​ కనిపించబోతున్నారు. చరిత్రలోని ఘటనలకు కొన్ని కల్పనలు యాడ్​చేసి ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్​ పూర్తయ్యింది. ఎన్టీఆర్, చరణ్ లపై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే షూటింగ్ కంప్లీట్ అయినట్లే. ఇదిలా ఉంటే ఈ చిత్రం గతంలో తీవ్ర వివాదాస్పదమైంది.

కుమ్రం భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్​ ముస్లింల టోపీ పెట్టుకోవడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం చాలా రోజులు చెలరేగింది. మరోవైపు ఇదే సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర వేసిన చరణ్​.. పోలీస్​ డ్రెస్​లో కనిపించడం కూడా వివాదాస్పదమైంది. చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

తాజాగా కుమ్రం భీం పాత్రకు ముస్లిం టోపీ పెట్టే విషయంలో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్​ స్పందించాడు. నిజాం సైనికుల నుంచి తప్పించుకొనేందుకు మాత్రమే .. కుమ్రం భీం పాత్ర ముస్లిం టోపీ పెట్టుకోవాల్సి వచ్చిందంటూ చెప్పారు. ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరాజు పాత్ర ధారి చరణ్ పోలీస్​ డ్రెస్​ ఎందుకు వేసుకున్నారని అడగగా.. ఈ రహస్యం ఏమిటో మీరు సినిమాలోనే చూడాలంటూ విజయేంద్ర ప్రసాద్​ పేర్కొన్నారు.

Also Read

సార్​ మీ కులపోడినే.. కొద్దిగా చాన్స్​ ఇవ్వరూ..! బ్రహ్మాజీకి నెటిజన్​ అభ్యర్థన

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -