Saturday, May 18, 2024
- Advertisement -

మ‌రోసారి ర‌వితేజ‌ని ఢీ కొడుతున్న నాగ‌శౌర్య‌

- Advertisement -

హీరో నాగ‌శౌర్య సీనియర్ హీరో ర‌వితేజ‌తో మ‌రోసారి పోటీ ప‌డుతున్నాడు.గ‌తంలో వీరిద్ద‌రు న‌టించిన సినిమాలు ఒకే రోజున‌ విడుద‌ల అయ్యాయి., రేపు25) మళ్లీ వీళ్లిద్దరి న‌టించిన సినిమాలు ఒకే రోజున‌ రాబోతున్నాయి. రవితేజ సినిమా ‘నేల టికెట్’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నాగశౌర్య సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ర‌వితేజ పూర్తి మాస్ సినిమాగా వ‌స్తుంటే..నాగ‌శౌర్య పూర్తి ఫ్యామిలీ డ్రామాతో వ‌స్తున్నాడు.

ఈ రెండు సినిమాల‌పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు హీరోలు. గ‌తంలో వీర‌ద్ద‌రి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు నాగ‌శౌర్య హిట్ కొట్ట‌గా, ర‌వితేజ సినిమా ఫ్లాప్ అయింది.రవితేజ లాస్ట్ సినిమా ‘టచ్ చేసి చూడు’, నాగశౌర్య ‘ఛలో’ సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. వాటిల్లో టచ్ చేసి చూడు ఫెయిల్యూర్‌గా నిలిచిపోగా, ఛలో కమర్షియల్‌గా హిట్ అయ్యింది. మ‌ళ్లీ వీళ్లిద్ద‌రే బాక్సాఫీస్ ద‌గ్గ‌రే పోటీ ప‌డుతుండ‌టంతో ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -