Saturday, May 4, 2024
- Advertisement -

పీవీ సింధుని కండ‌ల‌తో ప‌డేసిన అఖిల్‌!

- Advertisement -

పీవీ సింధుని అఖిల్ ప‌డేయడం ఏంటీ అనుకుంటున్నారా! ఏమీ లేదండీ… కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్‌ విసిరిన ఫిట్‌నెస్ సవాల్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటుడు హృతిక్‌ రోషన్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌కు రాథోడ్ సవాలు విసిరారు. దీనికి హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్ స్పందించారు.

సైనా నెహ్వాల్.. తన సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు సవాల్ విసిరారు. దీనికి సింధు స్పందిస్తూ జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తుల వీడియోను ట్విట్టర్‌లో పెట్టింది. అంతేకాకుండా దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, జోష్నా చిన్నప్పకు సింధు సవాల్ విసిరింది. ఈ సవాల్‌ను స్వీకరించిన అఖిల్ అదిరిపోయే వీడియోను ట్వీట్ చేశాడు. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను అఖిల్ ట్విట్టర్ పెట్టాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -