Sunday, May 19, 2024
- Advertisement -

విధుల‌ను బ‌హిస్క‌రించ‌నున్న టీటీడీ ఉద్యోగులు..

- Advertisement -

టీటీడీ వివాదం రోజు రోజుకీ ముద‌రి పాకానా ప‌డుతోంది. తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై మాజీ ప్ర‌ధానార్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోప‌న‌లు చేసిన‌ప్ప‌టినుంచి ఈ వివాదం కొన‌సాగుతోంది. ర‌మ‌ణ‌దీక్షితుల వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా టీటీడీ ఉద్యోగులు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రేపు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు విధులు బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాయి. తిరుపతి పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై కాసేపు చర్చించాచి న‌ర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే అర్చ‌కులు, ఉద్యోగులు న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెలుపుతూ విధులు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తిరుమలలో ఆలయ పవిత్రతను దిగజార్చేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. టీటీడీలో పరిపాలన తీరు బాగోలేదని, అవినీతి జరుగుతోందని, గులాబీ వజ్రం పోయిందని తీవ్ర ఆరోపణలు చేస్తోన్న రమణ దీక్షితులు నిన్న ఢిల్లీకి సైతం వెళ్లి పలువురు బీజేపీ నేతలతో కూడా చర్చించారు. తిరుమల వ్యవహారాలు ఎన్నడూ లేనంతగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -