Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో మెగా మేన‌ల్లుడు హీరోగా

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి కుటుంబం అంతా పెద్ద కుంటుంబం లేదు. ఆ కుటుంబంలో చిరంజీవి కుటుంబ‌స‌భ్యులు, అటు సురేఖ‌, ఇటు ప‌వ‌న్‌, నాగ‌బాబు కుటుంబ‌స‌భ్యులు చిరంజీవి పేరు చెప్పుకొని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్నారు. అంద‌రూ చిరంజీవి ఆశీస్సుల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌స్తున్నారు. ఇటీవ‌ల చిరంజీవి కుమార్తె భ‌ర్త క‌ల్యాణ్ కానుగంటి తెలుగు అరంగేట్రంకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మ‌రో అల్లుడు రానున్నాడు.

చిరంజీవి సోద‌రి విజ‌య‌దుర్గ కుమారుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాల్లోకి వ‌చ్చి రాణిస్తున్నాడు. ఇప్పుడు ఇత‌డి సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాల్లోకి వ‌స్తున్నాడ‌ట‌. వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని స‌మాచారం. నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాణంలో ఈ మెగా మేనల్లుడిని పరిచయం చేయబోతున్నాడట.

అయితే వైష్ణవ్ తేజ్ చిన మామయ్య పవన్‌కల్యాణ్ వెంట ఎక్కువ‌గా ఉండేవాడు. ప‌వ‌న్ పార్టీ జనసేన కార్య‌క్ర‌మాల్లో క‌నిపించాడు. వైష్ణ‌వ్ నటనలో మెల‌కువలు నేర్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరి షూటింగ్‌కి అప్పుడప్పుడు వెళ్తుంటాడు. ఇద్దరి మామయ్యల స‌హాయంతో సినిమాలోకి వ‌స్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -