- Advertisement -

జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబుకు తెలిసిపోయిందా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలన్నీ కూడా చంద్రబాబు భయపడినట్టుగానే సాగుతున్నాయి. ఎంతగా ప్రచార పటాటోపంతో మభ్యపెడుతున్నప్పటికీ, వందల కోట్ల రూపాయలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలు చేస్తున్నప్పటికీ వైఎస్ జగన్‌ని నిలువరించడం మాత్రం చంద్రబాబుకు తలకుమించిన భారమవుతోంది. వైఎస్‌ల ప్రజాదరణను ఎదుర్కోవడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు.

తాజాగా సీ ఓటర్ సర్వే కూడా చంద్రబాబు నాయుడు బిజెపితో కలిసి పోటీ చేసినప్పటికీ 2019ఎన్నికల్లో జగన్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పేసింది. పవన్ కళ్యాణ్‌కి రాజకీయ తెరపై అసలు సినిమానే లేదన్న విషయం తేల్చేసింది. 2014ఎన్నికల్లో కంటే ఐదు ఎంపి సీట్లు జగన్‌కి పెరగనున్నాయి. ఆ మేరకు టిడిపి పూర్తిగా నష్టపోనుంది. ఈ లెక్కన చూస్తే ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో మార్పులు ఉంటాయనడానికి సందేహం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా కూడా మరోసారి మోడీ హవా ఖాయం……మోడీకి 300 సీట్లకు పైగా రావడం ఖాయం అని ఇదే సీ ఓటర్ సర్వే చెప్పిన నేపథ్యంలో ఎపిలో మోడీకి ఓట్లు సీట్లు తగ్గే పరిస్థితి ఉందంటే అంతా కూడా బాబుపై ఉన్న వ్యతిరేకతే అనుకోవాలి. 2014ఎన్నికల్లో 600 ఉచిత హామీలు, హోదా, రైల్వేజోన్‌లాంటి కేంద్ర హామీలతో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మాత్రం ఆ అవకాశం అస్సలు కనిపంచడం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా పూర్తిగా మసకబారిపోయింది. 2014 ఎన్నికల సమయం తర్వాత నుంచీ జగన్‌కి ఇంకా ప్రజాదరణ పెరిగిందని సీ ఓటర్ సర్వే చెప్తోంది. పాదయాత్ర తర్వాత ఆ ప్రజాదరణ అత్యున్నత స్థాయి వెళ్తుందనడంలో సందేహం లేదు. అలాంటి నేపథ్యంలో 2019ఎన్నికల్లో కూడా పచ్చ మీడియా అబద్ధపు ప్రచారాలు, రాజకీయ వ్యూహాలు, కుట్రలతో చంద్రబాబు జగన్‌ని ఎదుర్కోగలడా? ప్రస్తుతానికి సీ ఓటర్ సర్వే మాత్రం 2019ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు తథ్యమని చెప్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -